KKD: స్వచ్ఛ నగరంగా ఉంచాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేసి పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి. ఇందులో భాగంగా కాకినాడలో వివేకానంద పార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.