GNTR: మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో పాటు పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ జానీ సైదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.