TG: హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో హాంకాంగ్‌కు అక్రమంగా విదేశీ కరెన్సీ తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. సదరు ప్రయాణికుడి వద్ద ఎలాంటి అనుమతులు లేని రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించారు.