JGL: ఇబ్రహీంపట్నంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కృష్ణారావు పరిశీలించారు. మొక్కజొన్న సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని, కొనుగోలు చేసిన మొక్కజొన్నను గోదాంలకు తరలించాలని సిబ్బందికి సూచించారు.