SDPT: జిల్లా ఆసుపత్రి వైద్యులు 139కిలోల బరువున్న గర్భిణికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి, 3.75 కిలోల ఆడ శిశువును కాపాడారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు భరించలేక యాప్రాల్‌కు చెందిన పూజ దంపతులు గజ్వేల్‌కు రాగా, సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ బృందం క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో వైద్యులపై ప్రశంసలు కురుస్తున్నాయి.