మహారాష్ట్రలో తన్వీర్ అనే ఓ యువకుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సుమారు 180 మంది పిల్లలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, స్థానిక మున్సిపల్ అధికారులు అతడి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాలను గుర్తించి బుల్డోజర్తో కూల్చివేతలు చేపట్టారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.