GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ సమీపంలో బుధవారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఒక సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న బాలుడికి తీవ్రమైన గాయాలయ్యాయి. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వెంటనే కర్నూల్‌కు తరలించారు.