ADB: అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తతే శ్రీరామరక్ష అని అధికారులు పేర్కొన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 20 వరకు సాగే ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్స్, హోటళ్లు, విద్యాసంస్థల్లో ప్రమాదాల నివారణపై ప్రదర్శనలు నిర్వహించనున్నారు.