GNTR: తెనాలి హెడ్ వాటర్ వర్క్స్ మోటార్ రిపేర్ కారణంగా బుధవారం పట్టణంలోని 40 వార్డులకు మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. ప్రజలు దీనిని గమనించి ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. గురువారం నుంచి యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని, కావున ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.