ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీసు సిబ్బందికి దాతల సహకారంతో ఏర్పాటుచేసిన పోలీస్ యూనిఫామ్‌లను సిబ్బందికి అంబేద్కర్ జయంతి సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకమని ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి పోలీసు సిబ్బంది ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, తదితరులు పాల్గొన్నారు.