BHPL: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, టీజీ ఎండీసీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, ఇందిరమ్మ ఇళ్లుకు ఇసుక సరఫరా, కొడవటంచ దేవాలయ జాతర ఏర్పాట్లు, రైతులు యూరియా కొరకు యాప్ ద్వారా బుకింగ్ చేయుట తదితర అంశాలపై సమీక్షా నిర్వహించారు.