ASF: కాగజ్ నగర్ మండలం బలగాలలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 0% ఉత్తీర్ణత సాధించింది. ఈ కళాశాల నుంచి ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. జిల్లావ్యాప్తంగా ‘జీరో రిజల్ట్’ నమోదైన ఏకైక కళాశాలగా ఇది నిలిచింది. పర్యవేక్షణ లోపం, బోధన వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి.