TG: హైదరాబాద్ బేగంపేట యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వెంకట్ రమణ ఓ NRI ఖాతా నుంచి రూ.7 కోట్లు కాజేశాడు. ఆస్ట్రేలియాలో ఉండే బాధితుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి 41 విడతల్లో ఈ సొమ్ము డ్రా చేశాడు. 2024లో ఫిర్యాదు అందగా, పరారీలో ఉన్న నిందితుడిని పంజాగుట్ట పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మరికొందరు సిబ్బంది ప్రమేయంపై విచారణ జరుగుతోంది. ప్రజల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన మేనేజరే మోసానికి పాల్పడటం సంచలనం రేపింది.