TG: ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లకు పైగా నగదు మాయమయ్యాయి. ఈ ఘటన HYDలోని SR నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఆడిట్లో SR నగర్ పరిధిలోని 31 ఏటీఎంలలో తనిఖీలు చేపట్టగా 8 ఏటీఎంలలో భారీగా నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. రూ.1,20,98,500 నగదు లోటు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.