కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకు స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల్లో భాగంగా రాజోలు చర్చిలో శానిటరీ వర్కర్లకు నిర్వహించే మెడికల్ క్యాంపు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విశ్వేశ్వరాయపురం గ్రామ పంచాయతీలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారు.