KMR: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని బాక్సింగ్ స్టార్ నిఖత్ జరీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిఖత్ జరీన్కి డీఎస్పీ ఉద్యోగం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిఖత్ జరీన్ కుటుంబ సభ్యులున్నారు.