కృష్ణా: కేంద్ర శిక్షణ సంస్థ సహకారంతో రూపొందించిన అప్లికేషన్ డెవలపర్, వెబ్ & మొబైల్ కోర్స్‌ను మార్చి నెల నుంచి పెడన స్కిల్ హబ్‌లో ఉచితంగా ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు. ఈ కోర్స్ ద్వారా యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వెబ్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ నైపుణ్యాలను నేర్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.