TG: HYDలోని ఇందిరాపార్క్ వద్ద RTC జేఏసీ ధర్నా చేపట్టింది. చలో సెక్రటేరియెట్కు పిలుపునిచ్చింది. RTCని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరింది. వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది.