Akash Puri: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తనయుడు ఆకాశ్ పూరీ (Akash Puri) పేరు మార్చుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈవిషయాన్ని వెల్లడించారు. ఇకపై తన పేరు ఆకాశ్ పూరీ కాదు. మరెంటీ అంటారా ఇకపై ఆకాశ్ జగన్నాథ్. ఈమేరకు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం ఆయన కెరీర్ పరంగా విజయాలు అందుకోవాలనే ఉద్దేశంతో ఆయన పేరు మార్చుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పూరీ జగన్నాథ్ తనయుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిరుత’, ‘బుజ్జిగాడు’ తదితర చిత్రాల్లో అలరించారు. ఆ తరువాత ‘ఆంధ్రాపోరీ’తో హీరోగా మారారు. వరుసగా ‘మెహబూబా’, ‘రొమాంటిక్’, ‘చోర్ బజార్’ సినిమాల్లో నటించారు. ఆయా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దాంతో తన పేరును మార్చుకున్నారని పలువురు నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ కూడా సాయి దుర్గా తేజ్‌గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే.