Man Hanged : పిల్లల అల్లరి ఆపే ప్రయత్నంలో.. పొరపాటున ఉరి బిగుసుకుని వ్యక్తి మృతి
పిల్లలు అల్లరి మితిమీరడంతో ఓ వ్యక్తి వారిని మందలించే ప్రయత్నం చేశాడు. భార్య అడ్డుపడటంతో వారిని బెదిరించేందుకు ఉరి వేసుకున్నట్లు నటించాడు. అయితే అది నిజంగానే బిగుసుకుని అతడు చనిపోయాడు. ఈ విషాధ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
Man Hanged Himslef In Visakhapatnam : పిల్లల అల్లరిని మాన్పించబోయి ఓ తండ్రి ఏకంగా పరలోకాలకు చేరుకున్నాడు. ఈ ఘటనతో విశాఖపట్నంలో తీవ్ర విషాదం నెలకొంది. ‘మీరు అల్లరి చేస్తే నేను చచ్చిపోతా’ అంటూ ఆ వ్యక్తి ఫ్యాన్‌కి ఉరేసుకుని బెదిరించబోయాడు. అది నిజంగానే బిగుసుకోవడంతో కుటుంబం అంతా చూస్తుండగానే మరణించాడు. బీహార్‌కు చెందిన చందన్‌కుమార్(chandan kumar) రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకోపైలెట్. ఐదేళ్లుగా వీరి కుటుంబం విశాఖలోని కొత్తపాలెంలో నివాసం ఉంటోంది. వీరికి ఒక కుమార్తె(7), ఒక కుమారుడు(5) ఉన్నారు.
బుధవారం రాత్రి పిల్లలు ఇద్దరూ ఆడుకుంటూ తండ్రి చొక్కా జేబులోని డబ్బు నోట్లను చించి పడేశారు. ఈ క్రమంలో వారిని మందలించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో భార్య ఆయనకు అడ్డుపడింది. దీంతో వారి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో తనకు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందని చందన్ కుమార్ అన్నాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించబోయాడు. ఎవరూ ఆయన మాట లెక్క చెయ్యలేదు. దీంతో చీర తీసుకొచ్చి ఫ్యాన్‌కి ఉరి(Hang) వేసుకుంటున్నట్లు బెదిరించాలనుకున్నాడు. అయితే వారిని భయపెట్ట క్రమంలో చీర నిజంగానే అతడి గొంతుకు బిగుసుకుంది. దీంతో భార్య అతడిని రక్షించేందుకు చాలా ప్రయత్నించింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని కాపాడే ప్రయత్నం చేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన అతడు మరణంచాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.