WGL: మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావును మంత్రి కొండా సురేఖ కలిశారు. ఈ సందర్భంగా తరాలు మారినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను స్మరించుకున్నామని, మండుటెండల్లో ప్రజల కోసం నడిచిన రాజన్న అడుగులు, పేదల పట్ల చూపిన ఆ ప్రేమ మాకు ఎల్లప్పుడూ ఆదర్శమని మంత్రి ట్వీట్ చేశారు.