MBNR: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి రైతుకు అందాలంటే ఫార్మర్ ఐడీ అనేది తప్పనిసరి అని మహమ్మదాబాద్ మండలం నంచర్ల క్లస్టర్ ఏఈవో మౌనిక తెలియజేశారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని ఫార్మర్ ఐడీని పొందడానికి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకొని రైతు వేదిక దగ్గరికి రావాలన్నారు.