BDK: ఆళ్లపల్లి మండలం రామాంజిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన గ్రామస్థులు తమ గ్రామంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కరించాలని బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో తాగునీరు రహదారులు విద్యుత్ తదితర మౌలిక వసతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.