Mahabubnagar MLC:మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నవీన్ కుమార్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. బీర్ఎస్ పార్టీ శ్రేణులు తిరిగి తమ స్థానాన్ని దక్కించికోవడంలో విజయం సాధించారు. దీంతో పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నిల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. దాంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున నవీన్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.