E.G: ఈ నెల 22వ తేదీన రాజమండ్రి హ్యాపీ స్ట్రీట్ వద్ద 5కే రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ప్రముఖ టాలీవుడ్ నటులు భద్రం స్థానిక వెంకటేశ్వరనగర్ పార్క్, హ్యాపీ స్ట్రీట్, ఆర్ట్స్ కళాశాల మైదానంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఫిట్నెస్ పెంచుకోవడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 5కే రన్ ఉత్తమ మార్గం అన్నారు.