JGL: రాయికల్ పట్టణంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్ను బకాయిలు ఉన్నవారు ఏప్రిల్ 1-30 లోపు చెల్లించినట్లయితే 5% రాయితీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని రాయికల్ మున్సిపల్ కమిషనర్ నాగరాజు తెలిపారు. కావున పట్టణ ప్రజలు గమనించి ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇంటి పన్ను చెల్లించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.