TG: రంగారెడ్డి జిల్లాలోని కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని మాజీమంత్రి హరీష్ రావు పరిశీలించారు. గతంలో మార్కెట్కు భూసేకరణలో భాగంగా రూ. 10 కోట్లు రైతులకు ఇప్పించారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కట్టాలనుకున్నాం వెల్లడించారు. ప్రభుత్వాలు రైతుల కోసమే పనిచేయాలి కానీ, దళారుల కోసం కాదని హితవు పలికారు.