నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే సరిచేసుకోండి. ఎందుకంటే నిద్రలేమి మూలంగా ఆరోగ్యవంతులు రాత్రికి రాత్రే ముందస్తు మధుమేహం బారినపడే అవకాశమున్నట్లు అధ్యయనం హెచ్చరిస్తోంది. కాకపోతే మధుమేహంగా గుర్తించేంత స్థాయిలో ఉండవు. ఇది మున్ముందు పూర్తిస్థాయి మధుమేహంగా మారే ప్రమాదముంది.