AP: CM చంద్రబాబు నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో 100 రోజుల కార్యచరణను ప్రకటించారు. నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్రంలోని 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులకు బాధ్యతలను అప్పగించారు. ఇరిగేషన్, అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. ఈ నెల 6-15 తేదీల్లో పనుల గుర్తింపు, 16-20ల్లో పాలనా అనుమతులు ఇవ్వాలన్నారు.