WGL: వరంగల్ నగరంలో ఎన్ఐటీ వరంగల్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ ఇటికాల మధుసూదన్ రావు జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుంకరి వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఆర్ఈసీ వరంగల్‌కు తీసుకురావడంలో వారు చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయనను నిట్ యాజమాన్యం విస్మరించడం శోచనీయమని పేర్కొన్నారు.