SRD: లా సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచినట్లు సంగారెడ్డి జిల్లా తెలంగాణ గిరిజన లా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇంటర్ మీద ఐదు సంవత్సరాలు, డిగ్రీ మీద మూడు సంవత్సరాల లా కోర్సు ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు www.ttrwlc.in వెబ్ సైట్ చూడాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.