ASR: ముంచింగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ మాలగుమ్మి గ్రామంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని గిరిజన సంఘం మండల కార్యదర్శి కే. నర్సయ్య తెలిపారు. గత వారం రోజులుగా నీటి సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాటర్ ట్యాంక్‌ను వెంటనే మరమ్మతు చేసి తాగునీరు అందించాలని అధికారులను డిమాండ్ చేశారు.