NGKL: పదర మండలంలోని చిట్లంకుంట సమీప అటవీ ప్రాంతంలో ఉడిమెళ్ళ గ్రామానికి చెందిన ఉప్పతల గోవింద్ (50) చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం పశువుల కాపరులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పదర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.