గుంటూరు: తెనాలిలో ఒంగోలు జాతి ఎడ్లబండ్ల పోటీలు శనివారం రాత్రి ఘనంగా ముగిశాయి. సీనియర్స్ విభాగంలో తెలంగాణ హుజూర్ నగర్‌కు చెందిన సుంకి సురేందర్ రెడ్డి ఎడ్ల జత 3350.03 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. వీటి యజమానికి బుల్లెట్ బైక్‌ను MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్, MLA నక్కా ఆనందబాబు అందజేశారు. ఆర్కే బుల్స్ రాజశేఖర్ జత ఎద్దులు రెండో బహుమతి, అందుకున్నారు.