»Imran Khan Imran Khan Accused Of Adding Toilet Cleaner To His Wifes Food
Imran Khan: భార్య తినే ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతని భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని అతను జైలు నుంచి సంచలన ఆరోపణలు చేశారు.
Imran Khan: Imran Khan accused of adding toilet cleaner to his wife's food
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతని భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని అతను జైలు నుంచి సంచలన ఆరోపణలు చేశారు. విషపూరిత ఆహారం తిన్న వెంటనే ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నారని, ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. 190 మిలియన్ల పౌండ్ల అవినీతి కేసు విచారణలో భాగంగా ఆయన న్యాయమూర్తి ఎదుట ఈ ఆరోపణలు చేశారు. తన భార్యకు తగిన వైద్య పరీక్షలు చేయించడం లేదని, ఎవరితో మాట్లాడే అవకాశం కల్పించటలేదని అతను ఆరోపించారు.
కస్టడీలో ఉన్నప్పుడు మీడియాతో మాటలు తగ్గించుకోవాలని ఇమ్రాన్‌కి న్యాయమూర్తి తెలిపారు. కొన్ని విషయాల్లో స్పష్టత ఇవ్వడం కోసం మాట్లాడుతున్నట్లు ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. కొన్ని రోజుల కిందట కూడా ఇమ్రాన్ ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ బుష్రా అరెస్టుకు కారణమని తెలిపారు. ఒకవేళ తన భార్యకు ఏదైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. బతికున్నంత వరకు మునీర్‌ను వదిలిపెట్టేది లేదని ఇమ్రాన్ వార్నింగ్ ఇచ్చారు.