WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి MLA దొంతి మాధవరెడ్డి హాజరుకానున్నారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.