MBNR: జనగణనలో ఓబీసీ కులాలను లెక్కించకపోవడం అన్యాయమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వివిధ పార్టీలు, కుల సంఘలు, నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఎస్సీ, ఎస్టీలను లెక్కిస్తూ, ఓబీసీలను ‘ఇతరులు’గా చూపడం సరికాదన్నారు. బడ్జెట్లోనూ ఓబీసీలకు తగిన నిధులు కేటాయించకుండా మొండిచేయి చూపారని ఆయన విమర్శించారు.