MBNR: పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి ఎన్ శ్రీనివాస్ అన్నారు. యూనివర్సిటీలోని వసతి గృహాన్ని ఉపకులపతి శనివారం సందర్శించారు. భోజనం విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు.