TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్-2026కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం వరకు మొత్తం 2,89,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు JNTUH కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్ కోసం 2,03,167 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 86,523 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.