WGL: నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా భారతీయ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీ రామానంద్ హాజరై మాట్లాడుతూ.. మాతృభాష మన సంస్కృతికి పునాది అని, తెలుగు భాషను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.