VKB: తాండూరు మండలంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి తమ వంతు సహకారం అందిస్తామని ఎంఈవో ఇందుప్రియ తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన వెంకటయ్య గౌడ్ పదవీ విరమణ చేయడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. నూతన బాధ్యలు చేపట్టిన ఆమెను పీఆర్టీయూ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో పీఆర్టీయూ నాయకులు మహమ్మద్ ఖుద్దూస్, అబ్దుల్ రహమాన్, ఓమర్ పాల్గొన్నారు.