తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ICCC) ఏర్పాటు తర్వాత క్యూలైన్ మేనేజ్మెంట్ సులభతరమైనట్లు TTD అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే శ్రీవారి దర్శనం కోసం క్యూలో వేచి ఉండే సమయం చాలా తగ్గిందని, దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగినట్లు పేర్కొన్నారు. తొలి 3 నెలల్లో శ్రీవారిని 65 లక్షల మంది దర్శించుకోగా.. హుండీ ద్వారా రూ.356 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.