NLR: అమరావతిని రాజధానిగా ఆమోదించిన పార్లమెంట్ నిర్ణయంపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ బాయ్ కాట్ చేయడం దురదృష్టకరమన్నారు. రైతుల త్యాగాలు వృథా కాలేదని ఆయన అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికలతో అమరావతి దేశంలోనే అగ్ర రాజధానిగా రూపుదిద్దుకుంటుందని సోమిరెడ్డి పేర్కొన్నారు.