BHPL: కాటారం మండలంలోని చింతకాని క్రాస్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. యేసుప్రభువు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు.