ASF: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా యూసఫ్ ఖాన్కు శుక్రవారం నియామక పత్రం అందజేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని యూసఫ్ ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.