ATP: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ నెల 6న ఉ.9.25 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 10.10 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11.25 గంటలకు అనంతపురం జేఎన్టీయూకు చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం మ.1 గంటకు అనంతపురం నుంచి బయలుదేరి పుట్టపర్తికి చేరుకుని విజయవాడకు వెళ్తారు.