CSK 18 ఏళ్ల యువ సంచలనం ఆయూష్ మాత్రే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అదరగొడుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో IPLలో 19 ఏళ్లు నిండకముందే అత్యధిక 50+ స్కోర్లు సాధించిన మూడో ప్లేయర్‌గా మాత్రే(2 సార్లు) నిలిచాడు. ఈ జాబితాలో సూర్యవంశీ(3 సార్లు), పృథ్వీ షా(2 సార్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.