అన్నమయ్య: చిట్వేల్ టౌన్లో శుక్రవారం సాయంత్రం పోలీసులు ముమ్మరంగా వాహనాల చెకింగ్ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని ఆపి పత్రాలు పరిశీలిస్తూ, పాత ట్రాఫిక్ ఫైన్లు ఉన్నవారిపై స్పాట్లోనే రికవరీ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్ఐ వెంగయ్య ఆధ్వర్యంలో చిట్వేల్ కానిస్టేబుళ్లు నిర్వహించారు.