కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో జిల్లా, మండల విద్యాశాఖ అధికారులతో విద్యార్థులకు చదువు సర్వే విషయం గురించి కలెక్టర్ బాలాజీ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 9వ తరగతి నుంచి 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థుల పట్ల ఇప్పటినుంచి శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు.