GNTR: తాడేపల్లి పోలకంపాడులో ముస్లిం స్మశాన వాటిక అభివృద్ధి పనులకు TDP నేతలు శంకుస్థాపన చేశారు. మంత్రి లోకేష్ సొంత నిధులతో ఈ పనులు చేపడుతున్నారని వారు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ అహ్మద్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ షెల్టర్, సీసీ రోడ్డు, నీటి వసతి, లైటింగ్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. దీనిపై మత పెద్దలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.